logo

‘చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలి’

చట్ట సభల్లో బంజారాలకు ప్రాధాన్యం కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత బంజారా సేవాసంఘం (ఏఐబీఎస్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెంటకరమణనాయక్‌ డిమాండ్‌ చేశారు.

Published : 06 Feb 2023 03:44 IST

సంఘీభావం తెలుపుతున్న బంజారా నాయకులు

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: చట్ట సభల్లో బంజారాలకు ప్రాధాన్యం కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత బంజారా సేవాసంఘం (ఏఐబీఎస్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెంటకరమణనాయక్‌ డిమాండ్‌ చేశారు.. ఆదివారం సాయి ఆరామంలో ఉమ్మడి జిల్లా ఏఐబీఎస్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం, జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బంజారాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. గిరిజనుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యమే తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. సమావేశంలో విశ్రాంత ఐసీఎస్‌ అధికారి పీఎల్‌ రవీంద్రనాయక్‌, విశ్రాంత అగ్రికల్చర్‌ జేడీ బాలునాయక్‌, సునీతాశంకర్‌నాయక్‌, అనంతపురం జిల్లా అధ్యక్షులు బాలేనాయక్‌, జనరల్‌ సెక్రటరీలు చక్రినాయక్‌, శ్రీనివాసులునాయక్‌, సేవాలాల్‌ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ అశ్వర్థనాయక్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాసులునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని