logo

తెదేపా అధినేతకు ఘనస్వాగతం

తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్‌ వద్ద అనంతపురం

Published : 29 Mar 2024 04:10 IST

అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్‌ వద్ద అనంతపురం  జిల్లా తెదేపా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, అర్బన్‌ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు వాహనశ్రేణి వెంట రాప్తాడు సభకు బయలుదేరి వెళ్లారు. తాడిపత్రి నియోజవర్గ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి ఆర్డీటీ అతిథి గృహంలో చంద్రబాబును కలిసి సన్మానించారు. తెదేపా డాక్టర్‌ సెల్‌ విభాగం జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు, చంద్రబాబును కలిశారు. పూర్వపు అధ్యక్షుడు బీకే పార్థసారథిని అనంతపురం నగరం రాంనగర్‌లో నివాసంలో ఇటీవల హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడుగా నియమించిన బీవీ వెంకట్రాముడు మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని