logo

ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 04:18 IST

మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

అనంతనేరవార్తలు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో హింస, అల్లర్లు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా, నాటుసారా, కర్ణాటక మద్యం, నగదు, చీరలు అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజా దగ్గర ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాలకు వచ్చిపోయే అనుమానితుల, రౌడీషీటర్లపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు ఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, డీఎస్పీలు ఆంథోనప్ప, వీరరాఘవరెడ్డి, శ్రీనివాసులు, శివభాస్కర్‌రెడ్డి, రంగయ్య, శివారెడ్డి, ట్రైనీ డీఎస్పీ హేమంత్‌కుమార్‌, సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని