logo

శైలజానాథ్‌ అరెస్టు అప్రజాస్వామికం

ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ను పోలీసులు విజయవాడలో అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.బీఆర్‌ సురేష్‌బాబు విమర్శించారు. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. అమలాపురం ఘటనపై వాస్తవాలు

Published : 27 May 2022 05:43 IST


నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌బాబు, తదితరులు

కుప్పం పట్టణం: ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ను పోలీసులు విజయవాడలో అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.బీఆర్‌ సురేష్‌బాబు విమర్శించారు. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. అమలాపురం ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు బయల్దేరిన శైలజానాథ్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. శైలజానాథ్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెంకటరమణ, డీకే చంద్ర, బైరేగౌడు, రంగప్ప గౌడ, విజయ్, బాబు, హరీష్, అమ్రేష్‌ తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని