logo

భూ కుంభకోణం కేసులో తహసీల్దారు లొంగుబాటు

చిల్లకూరు మం డలం తమ్మినపట్నం భూకుంభకోణం కేసు లో తహసీల్దార్‌ గీతావాణి మంగళవారం గూడూరులోని అదనపు మొదటి తరగతి న్యాయమూర్తి కోర్టులో లొంగిపోయారు. తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని

Published : 29 Jun 2022 02:24 IST

పోలీసు వాహనంలో గీతావాణి

చిల్లకూరు, న్యూస్‌టుడే: చిల్లకూరు మం డలం తమ్మినపట్నం భూకుంభకోణం కేసు లో తహసీల్దార్‌ గీతావాణి మంగళవారం గూడూరులోని అదనపు మొదటి తరగతి న్యాయమూర్తి కోర్టులో లొంగిపోయారు. తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని కృష్ణపట్నం పోర్టుకు చెందిన సుమారు 209 ఎకరాల భూములను అన్‌లైన్‌లో అక్రమంగా 11 మంది పేరిట మ్యుటేషన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లకూరు పోలీసు స్టేషన్‌లో క్రైం నంబరు 177-21, 25-9-2021న నమోదైంది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గతంలో అరెస్టు చేయగా ప్రధాన నిందితురాలైన తహసీల్దార్‌ గీతావాణి తప్పించుకుని తిరిగారు. ముందస్తు బెయిల్‌ కోసం విజయవాడ వెళ్లొస్తూ స్థానికంగానే తిరుగుతున్న వైనంపై ఈనెల 16న ‘9 నెలలు.. కనిపించని నిందితులు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు ఆమె కోర్టులో లొంగిపోవడంతో న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం చిల్లకూరులోని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని