logo

బీవీరెడ్డి కుమారుడు ద్వారకనాథరెడ్డి మృతి

పులిచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, న్యూట్రీన్‌ ఫ్యాక్టరీ మాజీ అధినేత బీవీరెడ్డి రెండో కుమారుడు వి.ద్వారకనాథరెడ్డి(98) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన 32ఏళ్లుగా

Updated : 30 Sep 2022 03:41 IST

కల్లూరు, న్యూస్‌టుడే: పులిచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, న్యూట్రీన్‌ ఫ్యాక్టరీ మాజీ అధినేత బీవీరెడ్డి రెండో కుమారుడు వి.ద్వారకనాథరెడ్డి(98) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన 32ఏళ్లుగా తమిళనాడు రాష్ట్రం తిరుణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం వి.ద్వారకనాథరెడ్డి భౌతికకాయాన్ని తిరువణ్ణామలైలో ఖననం చేశారు. ఈయనకు కుమారుడు వి.దినేష్‌రెడ్డి, కుమార్తెలు పద్మశ్రీ అవార్డు గ్రహీత అనితారెడ్డి, సంధ్యారాణి సంతానం. ఆయన పులిచెర్ల మండల మాజీ ఎంపీపీ వి.మధుసూదన్‌రెడ్డికి స్వయాన చిన్నాన్న. విషయం తెలుసుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తెదేపా పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి తిరుణ్ణామలై వెళ్లి రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న ద్వారకనాథరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.


కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం

బెంగళూరు(యశ్వంతపుర): కుటుంబ కలహాలతో కావేరిలేఔట్‌ నివాసి గౌతమి(24) ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆమె భర్త రెడ్డిప్రసాద్‌, అతడి మొదటి భార్య ఆయేషాభానును మారతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గౌతమి, రెడ్డిప్రసాద్‌ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటికే అతనికి పెళ్లి అయిన విషయాన్ని దాచి పెట్టి తన కుమారైను పెళ్లి చేసుకున్నాడని గౌతమి తండ్రి బాబు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న మొదటి భార్య ఇంటికి రావడంతో వారి మధ్య గొడవలు జరిగాయని, అనంతరం స్నానాల గదిలోకి వెళ్లి గౌతమి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త తెలిపారు. తనను ఇద్దరూ కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తన కూతురు ఫోన్‌ చేసి చెప్పిందని, ఇద్దరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని