logo

35 ఏళ్లుగా గరుడసేవకు పాదయాత్ర

తమిళనాడు రాష్ట్రం ఆర్కాట్ తాలూకాలోని 40 గ్రామాల ప్రజలు 35 సంవత్సరాలుగా శ్రీవారి గరుడసేవకు పాదయాత్రగా తరలి వస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం 10 మంది

Updated : 30 Sep 2022 03:42 IST

శ్రీవారిరథంతో వస్తున్న తమిళనాడు భక్తులు

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం ఆర్కాట్ తాలూకాలోని 40 గ్రామాల ప్రజలు 35 సంవత్సరాలుగా శ్రీవారి గరుడసేవకు పాదయాత్రగా తరలి వస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం 10 మంది గోవింద భక్తులతో ప్రారంభమై ప్రస్తుతం 3000 మందితో  గరుడసేవకు బయలు దేరారు. రెండు గొడుగులతో పాటు స్వామివారి రథం ఊరేగింపుతో పాదయాత్ర చేపట్టారు. బుధవారం రాత్రి రాయలచెరువు కట్ట కింద ఆంజనేయస్వామి ఆలయంలోని రాయలవారి మండపంలో బస చేశారు. ఇదంతా శ్రీవేంకటేశ్వరస్వామి కృపవల్లే జరుగుతున్నట్లు తాము ఉన్నంత వరకు యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. పాదయాత్ర నిర్వాహకులు వినోబా, వెంకటేశన్‌, గాంధీ, చంద్రమోహన్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని