logo

గణనాథుడి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు.

Updated : 05 Oct 2022 06:53 IST

జస్టిస్‌ రవీంద్రబాబుకు స్వామివారి జ్ఞాపిక అందిస్తున్న ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి *  జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందిస్తున్న ఏఈవో

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, అర్చకులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తులకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు ఏఈవో అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. న్యాయమూర్తుల వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, సూపరింటెం డెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని