logo

నాడు పహారా.. నేడు ప్రదక్షిణ: ఊతకర్రతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న మాజీ సైనికుడు

దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాసిన ఓ సైనికుడు అనారోగ్యంతో కాలు కోల్పోయారు. పింఛను అందకపోవడంతో ప్రస్తుతం ఊతకర్ర సాయంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానిపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు టి.నరసింహులు(62).

Updated : 06 Oct 2022 07:13 IST

టి.నరసింహులు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాసిన ఓ సైనికుడు అనారోగ్యంతో కాలు కోల్పోయారు. పింఛను అందకపోవడంతో ప్రస్తుతం ఊతకర్ర సాయంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానిపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు టి.నరసింహులు(62). ఆర్మీ జవాన్‌గా జమ్మూ-కశ్మీర్‌, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. శ్రీలంకలో 1987 సంవత్సరం తమిళులపై దాడులు జరిగినప్పుడు వారికి రక్షణగా ఇండియన్‌ ఆర్మీ తరఫున పోరాటం చేశారు. 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. అనారోగ్యం బారినపడిన ఆయనకు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసి ఎడమకాలును పూర్తిగా తొలగించారు. 2019 నవంబరు 23న కుప్పం ప్రభుత్వాస్పత్రిలో సదరం శిబిరంలో 89 శాతం వికలత్వ నిర్ధారణ ధ్రువీకరణ పత్రం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వికలాంగ పింఛను కోసం 2019 సంవత్సరం నుంచి దరఖాస్తులు అందిస్తున్నారు. ఊతకర్రతో ఆటోలో వెళ్లి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం దయతలచి వికలాంగ పింఛను మంజూరు చేసి తనను ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని