logo

కుప్పంలో లోకేశ్‌ పాదయాత్ర జరగనుందిలా..

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 24 Jan 2023 20:03 IST

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 27న మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం బీఆర్‌ అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సివిల్‌ కేసులు ఎదుర్కొంటున్న మహిళా కార్యకర్తలతో సమావేశం కానున్నారు.  4.45 గంటలకు కమతమూరు రోడ్‌లో గంటపాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పలు వర్గాలతో సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు పీఈఎస్‌ వైద్య కళాశాల సమీపంలో బస చేయడంతో తొలిరోజు యాత్ర ముగుస్తుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. 8.10 గంటల నుంచి గంటపాటు యువతతో సమావేశమై వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఆరోజు సాయంత్రం 5.50 గంటలకు పాదయాత్ర పూర్తవుతుంది. మూడో రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.55 గంటలకు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెకు చేరడంతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని