logo

అమ్మవారి ఆలయంలో... పోలీసుపై ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ దాడి

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో పని చేస్తున్న ఆర్జిత ఇన్‌స్పెక్టర్‌, పోలీసు భక్తుల సమక్షంలో బాహాబాహీకి దిగిన సంఘటన గురువారం ఉదయం జరిగింది.

Published : 27 Jan 2023 02:35 IST

కల్యాణోత్సవంలో బాహాబాహీ

గాయపడిన కానిస్టేబుల్‌

తిరుచానూరు: శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో పని చేస్తున్న ఆర్జిత ఇన్‌స్పెక్టర్‌, పోలీసు భక్తుల సమక్షంలో బాహాబాహీకి దిగిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఆలయంలో ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌గా దామోదరం పనిచేస్తున్నాడు. ఉదయం జరిగిన అమ్మవారి కల్యాణోత్సవంలో విధులు నిర్వహిస్తుండగా... స్థానిక పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ శేషాద్రి పసుపు కోసం అక్కడకు వెళ్లాడు.  యూనిఫాంతో కల్యాణోత్సవ మండపంలోకి వెళ్లడంపై ఆర్జిత ఇన్‌స్పెక్టర్‌ అభ్యంతరం తెలిపాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని భక్తుల సమక్షంలో దూషించుకున్నారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. దామోదరం తన చేతిలోకి మ్యాన్‌ప్యాక్‌తో కానిస్టేబుల్‌ శేషాద్రి తలపై దాడి చేయడంతో రక్తగాయమైంది. కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు దామోదరంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆలయ అధికారులు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం..

దామోదరం తిరుమలలో పని చేసే సమయంలో ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఫిర్యాదు రావడంతో నాటి జేఈవో ధర్మారెడ్డి సస్పెండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాదిన్నర క్రితం తిరుచానూరు ప్రసాదాల ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆలయ అధికారులతో గొడవ పడుతుండడంతో తిరిగి తిరుపతికి బదిలీ చేసిన రెండు రోజుల్లోనే ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌గా అమ్మవారి ఆలయంలో బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని