logo

రూ.1.85లక్షల అక్రమ మద్యం స్వాధీనం

పలమనేరు జాతీయ రహదారిలోని మొగిలిఘాట్‌లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు.

Published : 08 Feb 2023 03:44 IST

ఇద్దరు నింతుల అరెస్టు

బంగారుపాళ్యం: పలమనేరు జాతీయ రహదారిలోని మొగిలిఘాట్‌లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ కథనం మేరకు.. గుడిపాల మండలం పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన సెందిల్‌కుమార్‌(29), గొల్లమడుగు గ్రామానికి చెందిన సురేష్‌రెడ్డి(28) కారులో బెంగళూరు నుంచి చిత్తూరు వైపునకు కర్ణాటక మద్యం తరలిస్తుండగా మొగిలిఘాట్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై మల్లికార్జునరెడ్డి కారులోని సుమారు రూ.1.85లక్షల విలువైన మద్యం, రూ.6లక్షల విలువైన కారు, రూ.50వేలు విలువైన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు సెందిల్‌కుమార్‌, సురేష్‌రెడ్డిలను అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని