logo

ఎక్కడ నియమిస్తారో..!

డీఎస్సీ-1998 అభ్యర్థులకు నియామకాలు ఏ విధంగా చేపడతారో స్పష్టత లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మిగులు పోస్టులను రెండు నెలల క్రితం సర్దుబాటు చేశారు.

Published : 21 Mar 2023 02:49 IST

డీఎస్సీ 1998 అభ్యర్థుల పోస్టింగ్‌లపై కదలిక

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: డీఎస్సీ-1998 అభ్యర్థులకు నియామకాలు ఏ విధంగా చేపడతారో స్పష్టత లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మిగులు పోస్టులను రెండు నెలల క్రితం సర్దుబాటు చేశారు. దీంతో అధికారుల గణాంకాల ప్రకారం ఖాళీలు లేనట్లు సమాచారం. ఇప్పుడు వీరిని ఒప్పంద పద్ధతిలో ఎక్కడెక్కడ నియమిస్తారోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను రెండు, మూడ్రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారులు పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఖాళీలు లేని పక్షంలో 1998 డీఎస్సీ అభ్యర్థులను ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. ఇప్పటికే జిల్లాలో 480మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధ్రువ పత్రాలు అప్‌లోడ్‌ చేసుకున్నారు. వాటిని ఐదు నెలల క్రితం పరిశీలించారు. అప్పటినుంచి ధ్రువ పత్రాల పరిశీలన చేసుకున్న వారందరూ నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఆ అభ్యర్థులకు ఖాళీలు చూపుతారో లేదో అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి డీఎస్సీ 1998 అభ్యర్థుల నియామకానికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీఈవో విజయేంద్రరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు