logo

దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌ అన్నారు.

Published : 10 May 2024 03:12 IST

కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌ అన్నారు. కుప్పం పట్టణంలోని తెదేపా కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, అలాంటి నాయకుడిని కుప్పం ప్రజలు ఓట్లు వేయడం వారి అదృష్టమన్నారు. కుప్పం ప్రజలు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమంత్రికి వేస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. లక్ష ఓట్ల ఆధిక్యత అందించేందుకు వన్నియకుల క్షత్రియ కుటుంబ సభ్యులను ఏకం చేసేందుకు కుప్పం వచ్చినట్లు ఆయన వివరించారు. తెదేపా హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయగా.. మిగిలిన వాటిని పూర్తి చేయలేక ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి నీరు రాలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి-కావేరీ అనుసంధానం చేసి హంద్రీ-నీవా ద్వారా జలాలు ఆంధ్రతో పాటు తమిళనాడు ప్రాంతానికి నీరు అందిస్తామన్నారు. తెదేపా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడారు. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, చంద్రశేఖర్‌, బిఎం రాజు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యేలు రాజ, నటరాజన్‌, ఇళవలవన్‌, మేఘనాథన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని