logo

ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!

ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది.

Published : 10 May 2024 03:27 IST

కుప్పంలో రూ.4 వేలు..
మిగిలిన చోట్ల రూ.2 వేలు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. ఓటర్లకు డబ్బు పంచుడు ఘట్టానికి వైకాపా తెరలేపింది. ఇంటింటా వెళ్లి తాయిలాల పంపిణీలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వాలంటీర్లుగా పనిచేసిన సమయంలో వైకాపాకు అనుకూలురు ఎవరు ?, తటస్థ ఓటర్లు ఎవరు ? అని గుర్తించిన డేటా ఆధారంగా పంపకాలు జరుగుతున్నట్లు భోగట్టా.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓటుకు రూ.4 వేలు ఇస్తోంది. మేము డబ్బు తీసుకోం అన్నా కూడా వినకుండా తమ వద్దనున్న స్లిప్పుల్లో టిక్‌ మార్క్‌ వేసి డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. వైకాపాకు అనుకూలంగా ఉండే వారితోపాటు తటస్థ ఓటర్లను గుర్తించి, వారిని ప్రలోభ పెడుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లను పక్కన పెట్టుకుని పంచుడు పనులు పూర్తిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ః  చిత్తూరులోనూ ఓటుకు రూ.2 వేలు దాకా ఇస్తున్నారు. స్లిప్పులు తెచ్చిన వారికి డబ్బు ఇచ్చి.. ఆ స్లిప్పులో అడ్డంగా ఒక గీత గీసి.. టిక్‌ మార్క్‌ వేస్తున్నట్లు సమాచారం. పలమనేరులోనూ డబ్బుల పంపకాల్ని వేగంగా చేస్తున్నారు. అనేక బృందాలు పల్లె, పట్టణాల్లో బృందాలుగా ఏర్పడి ఇంటింటా తిరుగుతూ పంపిణీ చేసేస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో డబ్బు పంపకాలు మొదలైనట్లు టాక్‌. జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరిలో శుక్రవారం నుంచి నగదు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు