logo

ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?

‘మేడమ్‌.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.

Published : 10 May 2024 02:57 IST

ఫెసిలిటేషన్‌ కేంద్రంలోని అధికారులపై ఉద్యోగి అసహనం

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘మేడమ్‌.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది. మా ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి.. నా తర్వాత వచ్చారు. ఆయన ఓటు వేసి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి ఇంత సేపు వెయిట్‌ చేయిస్తారా. అడుగుతుంటే పట్టించుకోరా? అంటూ ఓ ఉద్యోగి.. చిత్తూరు నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ కేంద్రంలోని అధికారి ఎదుట తీవ్రంగా ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన ఆ ఉద్యోగి.. ఆర్వోకి ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. అప్పుడు ఆయన్ను కూర్చోబెట్టి మాట్లాడారు ఆ అధికారి. మీవల్ల ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారంటూ హెల్ప్‌లైన్‌ సిబ్బందిపై మండిపడ్డారా ఆ అధికారి. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తున్న వ్యక్తిని.. వీడియో తీసింది చాలు, ఇక ఆపు అంటూ అతడిపైనా కోప్పడ్డట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని