logo

ఎన్నికల రోజు కార్మికులకు సెలవు

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్‌ యం.బాలునాయక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 10 May 2024 02:58 IST

బాలునాయక్‌

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్‌ యం.బాలునాయక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే 13వ తేదీన ఉద్యోగ, కార్మిక వర్గాలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కార్మికులకు సెలవు ఇవ్వకుంటే జరిమానాతోపాటు శిక్షార్హులని పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని