logo

జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!

తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి, విజయ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 10 May 2024 03:14 IST

నందమూరి రామకృష్ణ

రంజిత్‌కుమార్‌రెడ్డి, విజయ్‌యాదవ్‌ కుటుంబ సభ్యులకు కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానిస్తున్న నందమూరి రామకృష్ణ,
పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌

అరగొండ (తవణంపల్లె), న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి, విజయ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అరగొండలో ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల జెండాలు వేరైనా వాటి అజెండా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమేనని పేర్కొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, తెదేపా మండల గౌరవ అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, తెదేపా అధ్యక్షుడు దిలీప్‌నాయుడు, మాజీ ఎంపీపీ సరళకుమారి, మాజీ వైస్‌ ఎంపీపీ భాస్కర్‌నాయుడు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సునీల్‌కుమార్‌, కొండ్రాజుకాలువ సర్పంచి పరందామనాయుడు, ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అమరేంద్రనాయుడు, బాబునాయుడు, పైమాఘం గాంధీ, ప్రధాన కార్యదర్శి మధుకుమార్‌, జనసేన నాయకులు మోహన్‌, చిన్నా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని