logo

తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది

రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది.

Published : 10 May 2024 03:16 IST

దీనావస్థలో అన్న క్యాంటీన్లు

చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో అన్న క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన సచివాలయం

రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న పేదలతో పాటు వివిధ పనులపై పట్టణాలకు, నగరాలకు వచ్చే వేలమంది ఇక్కడికి వచ్చి ఆకలి తీర్చుకునేవారు. అలాంటి అన్న  క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే నిర్దాక్షిణ్యంగా మూసివేసింది. అనేకచోట్ల క్యాంటీన్ల భవనాలు సచివాలయాలుగా ఉండగా మరికొన్నిచోట్ల మూత్రవిసర్జనకు వినియోగిస్తున్నారు. నాడు ఆకలి తీర్చుకున్న పేదలు నేడు వీటి దుస్థితిని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ క్యాంటీన్లలో రోజుకు రూ.15కే మూడుపూటలా ఆకలి తీర్చుకున్నవారు నేడు దాదాపు రూ.150 చెల్లించినా అర్థాకలితోనే ఉంటున్నారు. ఇది జగన్‌ పేదలకు వేసిన శిక్ష.

ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, పలమనేరు, నగరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని