logo

మామిడికి గిట్టుబాటు ధర ప్రకటించాలి

ఈ సీజన్‌లో మామిడి టన్నుకి రూ.25 వేల గిట్టుబాటు ధర ప్రకటించేలా చర్యలు చేపట్టాలని జేసీ వెంకటేశ్వర్‌కి తెదేపా నాయకులు మంగళవారం విజ్ఞప్తిచేశారు.

Published : 22 Mar 2023 03:12 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఈ సీజన్‌లో మామిడి టన్నుకి రూ.25 వేల గిట్టుబాటు ధర ప్రకటించేలా చర్యలు చేపట్టాలని జేసీ వెంకటేశ్వర్‌కి తెదేపా నాయకులు మంగళవారం విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పది లక్షల మంది మామిడిపై ఆధారపడి బతుకుతున్నారని తెదేపా నాయకులు తెలిపారు. సిండికేటయ్యే గుజ్జు పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండీల్లో ఎలక్ట్రానిక్‌ కాటా ఏర్పాటు, రైతులకు వసతి కల్పన, కోల్డ్‌ స్టోరేజీ సదుపాయంతోపాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌, వెంకటేష్‌యాదవ్‌, మేషాక్‌ పాల్గొన్నారు.

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: క్షయ బాధితులు చికిత్సతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలి. అప్పుడే వ్యాధి త్వరగా నయమై ఆరోగ్యంగా ఉంటారని జేసీ వెంకటేశ్వర్‌ తెలిపారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని సమావేశ మందిరంలో మంగళవారం క్షయ బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేసి మాట్లాడారు.  జిల్లాలో 1,333 మంది ఉండగా 600 మందిని అపోలో ఫౌండేషన్‌ సంస్థ దత్తతకు తీసుకుని ప్రతి నెల రూ.700 విలువ చేసే పప్పు దినుసులు, నూనె, పాల పొడి, ఇతర ఆహార వస్తులతో కూడిన పౌష్టికాహారాన్ని పంపీణీ చేయనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని