logo

లింకు నొక్కాడు.. డబ్బులు పోయాయి

చరవాణికి వచ్చిన లింకును అనుసరిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయమైంది. రేణిగుంట పట్టణ పోలీసుల కథనం మేరకు...

Published : 30 Mar 2023 02:22 IST

రేణిగుంట: చరవాణికి వచ్చిన లింకును అనుసరిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ఖాతా నుంచి నగదు మాయమైంది. రేణిగుంట పట్టణ పోలీసుల కథనం మేరకు... తిరుపతి కొర్లగుంటకు చెందిన పురుషోత్తమన్‌ అమరరాజా పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో తన చరవాణికి ఒక షాపింగ్‌ యాప్‌ లింకు వచ్చింది. ఇందులో డబ్బులు వస్తాయని సందేహం రావడంతో అప్పటి నుంచి అతను తరుచుగా అందులో డబ్బులు వేస్తూ వచ్చాడు. ఇలా రూ.2.47 లక్షలు వరకు తన ఖాతాలో నుంచి పోయిన తరువాత బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై ఈశ్వర్య్య కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని