logo

మళ్లీ మొరాయించిన సర్వర్‌

జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మంగళవారమూ సర్వర్‌ మొరాయించింది. దీంతో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవల్లో స్తంభన తలెత్తింది. సర్వర్‌ పనిచేయక పోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Published : 31 May 2023 04:07 IST

మాన్యువల్‌ పద్ధతిలో ఫొటోలు, వేలిముద్రల సేకరణ

చిత్తూరు అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వేచి ఉన్న ప్రజలు

చిత్తూరు(సంతపేట): జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మంగళవారమూ సర్వర్‌ మొరాయించింది. దీంతో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవల్లో స్తంభన తలెత్తింది. సర్వర్‌ పనిచేయక పోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సర్వర్‌ సమస్య తీరేంత వరకు ప్రత్యామ్నాయ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిర్వహించాలని ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ-కేవైసీ, చెక్‌ స్లిప్‌ జారీ సేవలు జరుగుతున్నాయి. అయితే దస్తావేజుల వెనుక వేలిముద్రలు, ఫొటోలు ప్రింటింగ్‌ సమయంలో సర్వర్‌ మొరాయిస్తోంది. దీంతో పాత పద్ధతిలో 32(ఏ) ఫారంలో క్రయవిక్రయదారుల ఫొటోలు అతికిస్తున్నారు. టీఏ రిజిస్ట్రేషన్‌ ఫారంలో వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. మార్కెట్‌ విలువల సవరణకు, సర్వర్‌ పనిచేయకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదని, ఒకవేళ ధరలు పెరుగుతున్నా సర్వర్‌ ఆపడం అనేది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మాన్యువల్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. సాధారణంగా జిల్లాలో రోజూ 400 వరకు దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంటాయి. ఈ రెండ్రోజుల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు చాలా తక్కువనేనని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని