logo

YSRCP Leader: రేయ్‌... ఎక్కడున్నావ్‌... బయటకు రారా..

‘రేయ్‌ ఎక్కడున్నావ్‌.. బయటకు రారా.. నా గురించి ఫేస్‌బుక్‌లో పెడతావా... నీకు నియోజకవర్గ రాజకీయాలు కావాలా’...అంటూ పెద్దపంజాణి మండల వైకాపా కన్వీనర్‌ బాగారెడ్డి (జడ్పీటీసీ సభ్యురాలు సుష్మకీర్తి భర్త) తెదేపా పెద్దారికుంట,

Published : 30 Jan 2024 06:10 IST

తెదేపా క్లస్టర్‌ ఇన్‌ఛార్జిపై మండల వైకాపా కన్వీనర్‌ బెదిరింపులు

ఈనాడు, చిత్తూరు: ‘రేయ్‌ ఎక్కడున్నావ్‌.. బయటకు రారా.. నా గురించి ఫేస్‌బుక్‌లో పెడతావా... నీకు నియోజకవర్గ రాజకీయాలు కావాలా’...అంటూ పెద్దపంజాణి మండల వైకాపా కన్వీనర్‌ బాగారెడ్డి (జడ్పీటీసీ సభ్యురాలు సుష్మకీర్తి భర్త) తెదేపా పెద్దారికుంట, బట్టందొడ్డి క్టస్టర్‌ ఇన్‌ఛార్జి వేమారెడ్డిని బెదిరించిన ఆడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అక్కడితో ఆగకుండా పత్రికల్లో రాయలేని విధంగా అసభ్యంగా దూషించారు. ఆదివారం అర్ధరాత్రి వేమారెడ్డికి ఫోన్‌ చేసిన బాగారెడ్డి చరవాణిలో బూతుపురాణం మొదలుపెట్టారు. బాగారెడ్డి స్వగ్రామమైన ముదరంపల్లెలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో ఆదివారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి పర్యటించి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. దీనిని జీర్ణించుకోలేని బాగారెడ్డి.. టార్గెట్‌ చేస్తూ వేమారెడ్డిని నీ అంతు చూస్తానని బెదిరిస్తూ అసభ్యపదజాలంతో దూషించాడు. అమరనాథరెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదని, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వేమారెడ్డి బదులిచ్చారు. పదోతరగతి కూడా పాస్‌కాలేని నీవు అమరనాథరెడ్డిని విమర్శించేస్థాయి ఎక్కడిదని, బాగారెడ్డి అవినీతిపై తీవ్రస్థాయిలో వేమారెడ్డి ధ్వజమెత్తారు. దీంతో రెచ్చిపోయిన బాగారెడ్డి వినలేని అసభ్యపదజాలంతో బెదిరింపులకు పాల్పడడం వైకాపా దౌర్జన్యకాండకు నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ...వైకాపా నేతల బెదిరింపులు తారస్థాయికి చేరాయి. ప్రశ్నించే వారిపై తిరగబడడం, తెదేపా సానుభూతిపరులను బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని