logo

ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్‌

ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్‌ తలిగించుకున్నారు.

Published : 29 Mar 2024 02:42 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్‌ తలిగించుకున్నారు. తమకు అధికారం వచ్చినప్పటి నుంచి వాహనంపై ఇలానే ఉన్నా అధికారులు సైతం పట్టించుకోక పోవడం విడ్డూరం. కుప్పం మండల వైకాపా అధ్యక్షుడు మురుగేష్‌.. తన కుమారుడి పేరిట ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశారు. కోడలికి రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి వాహనంపై ‘గవర్నమెంట్‌ వెహికల్‌..’ అంటూ స్టిక్కర్‌ అతికించారు. సాధారణంగా ప్రైవేటు వాహనాలను ప్రభుత్వ కార్యాక్రమాలకు ఉపయోగిస్తే ‘ప్రభుత్వ విధుల్లో ఉన్న వాహనం..(ఆన్‌.. గవర్నమెంట్‌ డ్యూటీ)’ ఉంటుంది. అయితే వీరు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. తమకు నిబంధనలు వర్తించదంటూ వాహనంపై స్టిక్కర్‌ అలాగే కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు