logo

కేంద్ర పథకాల అమలు తీరుపై సమీక్ష

 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శనివారం ప్రధాని మోదీ వర్చువల్‌లో సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి జేసీ(అభివృద్ధి) కీర్తి, ఇతర అధికారులు హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా

Published : 23 Jan 2022 02:59 IST

కాకినాడ కలెక్టరేట్‌: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శనివారం ప్రధాని మోదీ వర్చువల్‌లో సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి జేసీ(అభివృద్ధి) కీర్తి, ఇతర అధికారులు హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, టెలీమెడిసిన్‌, వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, అంబులెన్స్‌ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. వీటిని ప్రజలకు వేగవంతంగా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్‌ బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర పథకాల తీరుపై సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని