logo

కొబ్బరి రైతు ధరహాసం

కోనసీమ కొబ్బరిమార్కెట్‌ దసరా శోభ సంతరించుకుంది. దేవీశరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇక్కడి కొబ్బరిమార్కెట్‌లో ధరలు పెరిగాయి. గత ఎనిమిది నెలలుగా ధరలు బాగా క్షీణించాయి. పైపెచ్చు ఆ ధరలు నిలకడగా ఉన్నాయి.

Published : 01 Oct 2022 05:20 IST

కొబ్బరికాయలను ఎగుమతులకు సిద్ధం చేస్తున్న కార్మికులు
న్యూస్‌టుడే, అంబాజీపేట

కోనసీమ కొబ్బరిమార్కెట్‌ దసరా శోభ సంతరించుకుంది. దేవీశరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇక్కడి కొబ్బరిమార్కెట్‌లో ధరలు పెరిగాయి. గత ఎనిమిది నెలలుగా ధరలు బాగా క్షీణించాయి. పైపెచ్చు ఆ ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో కొబ్బరిరైతులు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు దసరా మహోత్సవాలతో పాటు రానున్న దీపావళి, ఇతర రాష్ట్రాల్లో పండుగల నేపథ్యంలో కొబ్బరి ధరలు కొంచెం సంతృప్తికరంగా ఉన్నాయని అటు రైతులు... ఇటు వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు ముందు కొబ్బరికాయలకు పెద్దగా ధర పలకలేదు.అప్పుడు వెయ్యికొబ్బరికాయలు రూ.8,000 ధర ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.1,500లకు పెరిగి రూ.9,500 వద్ద నిలకడగా ఉంది. బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఛాట్‌పూజకు కొబ్బరి ధర పెరిగింది. ఆయా రాష్ట్రాల కొబ్బరికాయలకు డిమాండ్‌ వచ్చింది. ప్రస్తుతం బిహార్‌, ఝార్ఖండ్‌లతో పాటు గుజరాత్‌, మహారాష్ట్రలకు ఎగుమతులు జరుగుతున్నాయి.ఎనిమిది నెలల క్రితం 40 నుంచి 50 లారీల ఎగుమతులు జరిగేవి.ధర కొంచెం బాగుండటంతో ఇప్పుడు 100 నుంచి 120 లారీల కొబ్బరికాయలు ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వెయ్యి కొబ్బరికాయల ధర రూ.9,500 నుంచి ఇంకా ధర పెరిగితే కోనసీమ కొబ్బరిమార్కెట్‌ మరింత ఆశాజనకంగా ఉంటుందని కర్షకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని