logo

కుమార్తె ఆచూకీ కోసం ఆందోళన

అదృశ్యమైన కుమార్తె ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారని..బతికి ఉందో, లేదో తేల్చాలని డిమాండ్‌ చేస్తూ తాళ్లపూడిలో బాధిత తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం దీక్ష చేపట్టారు.

Published : 07 Dec 2022 02:51 IST

నిరసన దీక్షలో జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు

తాళ్లపూడి: అదృశ్యమైన కుమార్తె ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారని..బతికి ఉందో, లేదో తేల్చాలని డిమాండ్‌ చేస్తూ తాళ్లపూడిలో బాధిత తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం దీక్ష చేపట్టారు. బాధిత తల్లిదండ్రులు బండి రామకృష్ణ వరలక్ష్మి తెలిపిన వివరాలు ప్రకారం.. 13 ఏళ్ల కిందట ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నూతిరామపాలెంనకు చెందిన జ్యోతిని తాళ్లపూడి మండలం రాగోలపల్లికి చెందిన నీరుకొండ శ్రీనివాసుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వివాహ సమయంలో ఎకరం పొలం ఇస్తామన్నా..ఆ భూమికి సంబంధించి కొన్ని నిబంధనలు అడ్డు రావడంతో ఇవ్వలేకపోయామన్నారు. అప్పటి నుంచి తమ కుమార్తెను కట్నం కోసం వేధిస్తున్నారన్నారు. నవంబరు 13న జ్యోతితో అత్తింటి వారు గొడవపడ్డారని, 14 ఉదయం నుంచి ఆమె ఆచూకీ లేదన్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌కి వెళ్తే దురుసుగా సమాధానం చెప్పారని ఆరోపించారు. హోం మంత్రి వనిత, ఎమ్మెల్యే బాలరాజు,  దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. దీనిపై ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని