logo

పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు నిధుల గోల్‌మాల్‌పై విచారణ

పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు నిధుల గోల్‌మాల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీహెచ్‌ వెంకటసతీష్‌ను సస్పెండైన తపాలా ఉద్యోగినులు నిలదీయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Published : 04 Feb 2023 05:25 IST

ఉద్యోగులు నిలదీస్తుండగా తలదించుకున్న వెంకటసతీష్‌

అమలాపురం పట్టణం: పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు నిధుల గోల్‌మాల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీహెచ్‌ వెంకటసతీష్‌ను సస్పెండైన తపాలా ఉద్యోగినులు నిలదీయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలో అమలాపురం డివిజన్‌ తపాలాశాఖకు అనుసంధానంగా నడిచే ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు నిధులు రూ.1.21 కోట్ల గోల్‌మాల్‌ జరిగింది. సీబీఐ విచారణలో భాగంగా వెంకటసతీష్‌ను అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో శుక్రవారం కార్యాలయ ఏఎస్పీ విశ్వేశ్వరరావు విచారించారు. అక్కడికి వచ్చిన సతీష్‌పై సస్పెండైన తపాలా ఉద్యోగినులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను నిలువునా మోసం చేశావంటూ విలపించారు. నిధులు డిపాజిట్‌ చేయడం, పోస్టల్‌ జీవిత బీమా పాలసీల సొమ్ము విత్‌డ్రా చేయడం వంటి నకిలీ లావాదేవీలు ఎందుకు చేశావని ఆవేదన వ్యక్తం చేశారు. అతను సమాధానం చెప్పకుండా మేడపైకి వెళ్లడంతో ఉద్యోగినులు పోలీసులను ఆశ్రయించారు. వారు అక్కడికి వచ్చి వెంకటసతీష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని