logo

‘ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాల అణచివేతకు కుట్ర’

ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పీఆర్‌సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Published : 06 Feb 2023 05:11 IST

మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
సాయిశ్రీనివాస్‌, వేదికపై తిమ్మన్న, జిల్లా నాయకులు

కాకినాడ నగరం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పీఆర్‌సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక రామారావుపేట ఎస్టీయూ భవన్‌లో ఆదివారం కాకినాడ జిల్లా సంఘ సమావేశం జిల్లా అధ్యక్షుడు కూసుమంచి కాశీ విశ్వనాథ్‌ అధ్యక్షతన నిర్వహించారు. సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగుల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తిమ్మన్న మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపుల వల్ల  సకాలంలో జీతాలు రాకపోయినా అడగలేని స్థితిలో ఉద్యోగులున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామన్నారు. ఆ సంఘ ప్రతినిధులు దొరబాబు, మోర్త శ్రీనివాస్‌, ఎస్‌వీ నాయుడు, కేవీ శేఖర్‌, డి.వెంకట్రావు, ఎస్‌ఎస్‌ఎస్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌.సత్యనారాయణ, రామకృష్ణ, డానియేల్‌బాబు, జేకే శేఖర్‌, కృష్ణంరాజు, సంపత్‌, కిరణ్మయి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని