logo

సాంకేతికతతో ముందస్తు నష్ట నివారణ

నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్ట్‌ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో సంభవించే వరదలపై మూడు రోజుల అవగాహన సదస్సును కాకినాడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సెంటర్‌లోసోమవారం ప్రారంభించారు.

Published : 07 Feb 2023 05:14 IST

సూచనలిస్తున్న వెంకటరమణ

మసీదు సెంటర్‌ (కాకినాడ): నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్ట్‌ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో సంభవించే వరదలపై మూడు రోజుల అవగాహన సదస్సును కాకినాడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సెంటర్‌లోసోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సెంటర్‌ హెడ్‌, శాస్త్రవేత్త డా.వైఆర్‌ సత్యాజీరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పోలవరం ప్రాజెక్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈఈ పి.వెంకటరమణ హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బంగా తదితర రాష్ట్రాల నుంచి జలనరులశాఖ అధికారులు హాజరయ్యారు. అత్యాధునిక ఉపగ్రహ ఛాయాచిత్రాలు, హైడ్రలాజికల్‌ మోడలింగ్స్‌ వంటివి వరదలను అరికట్టడానికి ఎలా ఉపయోగపడతాయనే విషయాలను వివరించారు. వరదలను ముందుగా అంచనా వేసుకుని నష్ట నివారణ చర్యలు ఏలా చేపట్టాలనే విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో గతంలో సంభవించిన వరదలపై చేసిన పరిశోధనల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త జయకాంతన్‌, ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, రీసర్చ్‌ సైంటిస్ట్‌ పి.శివప్రసాద్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని