logo

అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి

కలెక్టరేట్‌ స్పందనలో వస్తున్న అర్జీలపై సంబంధితశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఆదేశించారు.

Published : 21 Mar 2023 05:37 IST

వైద్యులను సత్కరిస్తున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, జేసీ ధ్యానచంద్ర, డీఆర్వో సత్తిబాబు

అమలాపురం కలెక్టరేట్‌: కలెక్టరేట్‌ స్పందనలో వస్తున్న అర్జీలపై సంబంధితశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఆదేశించారు. సోమవారం ఆయన జేసీ ధ్యానచంద్ర, డీఆర్వో సత్తిబాబుతో కలిసి ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. 200 మంది వినతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజోలు మండలానికి చెందిన కడలి శ్రీనివాస్‌ తన రెండు కళ్లు కనిపించక కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులుపడుతుండగా అతనికి శస్త్రచికిత్సచేసి కంటిచూపు వచ్చేలా కృషి చేసిన వైద్యులు అశోక్‌కుమార్‌, హేమలత, సమీరాలను కలెక్టర్‌ స్పందన హాలులో సత్కరించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఎస్పీ కార్యాలయ స్పందనకు 35 అర్జీలు

అమలాపురం పట్టణం: అమలాపురం నల్లవంతెన దిగువన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 35 అర్జీలను పరిశీలించిన ఎస్పీ అర్జీదారుల సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేశారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం తాలుకావడ్డీవారిపేటలో దాహంతీర్చే బావిని కొందరు పూడ్చివేయడంతో తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని, బావిని పునరుద్ధరించాలని గ్రామస్థులు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని