logo

గర్భిణులు.. పిల్లల్లో రక్తహీనత నివారణపై దృష్టి

జిల్లాల్లో గర్భిణులు, పిల్లల్లో రక్తహీనత సమస్య నివారణపై ప్రధానంగా దృష్టి సారించామని, ఆ మేరకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 24 Mar 2023 04:36 IST

సమావేశంలో కలెక్టర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాల్లో గర్భిణులు, పిల్లల్లో రక్తహీనత సమస్య నివారణపై ప్రధానంగా దృష్టి సారించామని, ఆ మేరకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. వెలగపూడిలోని క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి పలు అంశాలపై గురువారం దూరదృశ్య సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించగా కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ ఎస్‌డీజీ లక్ష్యాల్లో భాగంగా ఇప్పటివరకు 11,764 మంది వివరాలు(79.66 శాతం) నమోదు చేసినట్లు తెలిపారు. గర్భిణులు 7,789 మంది నమోదుకాగా వీరిలో రక్తహీనత ఉన్న 1,820 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదోతరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
గృహ నిర్మాణాల వేగవంతానికి ఆదేశం: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా హౌసింగ్‌ అధికారి పరశురాంతో కలిసి డివిజన్‌, మండలస్థాయి అధికారులతో వెబ్బెక్స్‌ నిర్వహించారు. ఏప్రిల్‌ 8 నాటికల్లా గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతివారం జిల్లాలో 482 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజుల్లో 964 ఇళ్లతోపాటు, ఈ వారం మిగిలిన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా సగటు పురోగతి 14 శాతం ఉందని, నూరుశాతం సాధించే దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని