logo

‘జగనన్నకు చెబుదాం’ అర్జీలకు సరైన పరిష్కారం

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు.

Published : 31 May 2023 04:57 IST

సమీక్షిస్తున్న గోపాలకృష్ణ ద్వివేది

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎస్పీ సతీశ్‌కుమార్‌, అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జగనన్నకు చెబుదాం కింద వచ్చిన అర్జీలు..? పరిష్కారం..? కీలక శాఖల్లో తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ప్రత్యేక మోనటరింగ్‌ యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. వీటిని రాష్ట్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. వచ్చే అర్జీల తీరును పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి అవసరమైతే జిల్లాస్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌, జడ్పీ సీఈవో సత్యనారాయణ, ఇన్‌ఛార్జి డీఆర్వో శ్రీరమణి, డీపీవో విక్టర్‌, డ్వామా పీడీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని