logo

వైద్య కళాశాలను అగ్రపథంలో నిలుపుతాం

వైద్య కళాశాల, ఆసుపత్రికి సంబంధించి వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. మొదటి ఏడాది కోసం బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, అనాటమీ విభాగాలను ఇప్పటికే సిద్ధం చేశారు.

Published : 03 Jun 2023 04:23 IST

వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తి

వైద్య కళాశాల, ఆసుపత్రికి సంబంధించి వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. మొదటి ఏడాది కోసం బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, అనాటమీ విభాగాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా విభాగాల్లో  విద్యాబోధనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రసాయనాలు, రీఏజెంట్లు అందుబాటులోకి తీసుకొస్తాం. ల్యాబ్‌లో వసతులు, ఫర్నీచర్‌ ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే వచ్చేలా చూస్తాం.

భవనాలు, వసతుల పరిశీలన

ప్రభుత్వ వైద్యకళాశాల భవనాలను పరిశీలిస్తాం. ఆసుపత్రిలో వసతులు సరిచేస్తాం. లోటుపాట్లు ఉంటే వెంటనే ప్రభుత్వానికి నివేదించి వెంటనే సమకూరేలా చర్యలు చేపడతాం. వసతిగృహాలు, కళాశాల భవనాలు పెండింగ్‌ పనులు వేగవంతమయ్యేలా ఆదేశాలిస్తాం. వసతిగృహాలు ఆగస్టులోగా పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.

రెండు రోజుల్లో అధికారులతో సమీక్ష

కళాశాలకు కొత్తగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇంకా చేయాల్సిన పనులు, మౌలిక వసతులు, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మరో రెండు రోజుల్లో ఆసుపత్రి, కళాశాల అధికారులతో సమావేశమై చర్చిస్తాం. పీహెచ్‌సీ వైద్యురాలి నుంచి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా ఎదిగిన అనుభవాన్ని కొత్త వైద్య కళాశాల అభివృద్ధికి వినియోగిస్తా.

బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమంతి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనోజ్‌, ఆర్‌ఎంవోలు నసీరుద్దీన్‌, ప్రణవ్‌, విభాగాధిపతులు (హెచ్‌ఓడీలు) ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరి సమన్వయంతో కళాశాల, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని