logo

వివాదాస్పదంగా ఆలయంలో పుట్టినరోజు వేడుక

సర్పవరం స్వయంభూ శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 03 Jun 2023 04:23 IST

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: సర్పవరం స్వయంభూ శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు అంటే ప్రత్యేక పూజలు చేసుకోవాలని కానీ ఆలయంలో కేకు కోయడం, కొవ్వొత్తి ఆర్పడం తదితరాలు నిర్వహించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం ఆలయ గుమస్తా బోణం కుమార్‌ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో కేకు కోసి వేడుకలు నిర్వహించిన ఫొటోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈఓ భీమశంకరరావు వేడుకలను దగ్గరుండి జరిపించడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా ధార్మిక పరిషత్‌ అధ్యక్షుడు కవికొండల భీమశేఖర్‌, మాజీ ఆలయ ట్రస్టు ఛైర్మన్‌ పుల్లా శ్రీరాములు (శ్రీను) డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని