logo

ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్‌, పెద్దన్నగౌడ్‌ వాపోయారు.

Published : 25 Apr 2024 05:27 IST

ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ ప్రతినిధులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్‌, పెద్దన్నగౌడ్‌ వాపోయారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి పింఛనుదారుడికి ప్రభుత్వం నుంచి కనీసం రూ.2.50 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే 11 పీఆర్సీ తగ్గించేశారని, 27 శాతం ఇవ్వాల్సిన ఐఆర్‌ను 23 శాతానికి కుదించారన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. ప్రజాదర్బార్‌ కూల్చివేతతోనే విధ్వంస పాలన మొదలైందన్నారు. ఒకపక్క ఉద్యోగులను, మరోపక్క పింఛనుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాబోయే తరాలకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో చంద్రబాబును గెలిపించాలని నిర్ణయించామన్నారు. ఇదే విషయాన్ని జిల్లాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగ, పింఛనుదారులకు కరవుభత్యం టైంబాండ్‌ పెట్టి విడతల వారీగా చెల్లించేశారన్నారు. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల లాభం లేదన్నారు. వాలంటీర్లకు రోజుకు రూ.162 ఇచ్చి పని చేయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. జగన్‌ నేతృత్వంలో గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని, యువత మత్తుకు బానిసలవుతున్నారన్నారు. తెదేపా హయాంలో పోలవరం 72 శాతం పూర్తిచేస్తే, జగన్‌ నాశనం చేశారన్నారు. 75 శాతం రాజధాని కడితే దాన్నికూడా పక్కన పెట్టేశారన్నారు. దొంగ బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజలను నాశనం చేస్తున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని రౌడీరాజ్యం అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గ్రహించి జగన్‌ను గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకముందు పార్టీ గోడపత్రికలు ఆవిష్కరించారు. పార్టీ నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు