logo

తొలి అడుగులు ఇక్కడే

ఆమె గజ్జె కట్టింది ఇక్కడే.. 14వ ఏట కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం వచ్చారు. స్థానిక హరికథా కళాశాలలో చేరి సుమారు పదేళ్లు హరికథ నేర్చుకుని ఆట, పాట, మాటలతో దానిని విశ్వవ్యాప్తం చేశారు.

Updated : 26 Jan 2024 13:44 IST

ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారంపై హర్షం

 పామర్రు, కపిలేశ్వరపురం(న్యూస్‌టుడే): ఆమె గజ్జె కట్టింది ఇక్కడే.. 14వ ఏట కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం వచ్చారు. స్థానిక హరికథా కళాశాలలో చేరి సుమారు పదేళ్లు హరికథ నేర్చుకుని ఆట, పాట, మాటలతో దానిని విశ్వవ్యాప్తం చేశారు. ఆమే..డి.ఉమామహేశ్వరి.. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె తొలిసారిగా ప్రదర్శన ఇచ్చింది కూడా కపిలేశ్వరపురంలోనే. గురువులు, వేదపండితులు తంగిరాల బాలగంగాధర శర్మ ఆ కథ విని వెన్ను తట్టి పంపించారు. తరువాత విజయనగరంలో మొదలు పెట్టిన ఆమె ప్రస్థానం దేశ విదేశాల్లో మార్మోగింది. తొలి లలితకళా పురస్కారం కూడా కపిలేశ్వరపురంలోని సర్వారాయ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు నుంచే అందుకున్నారు. తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా..హరికథలో రాటు దేలేలా చేసింది మాత్రం కపిలేశ్వరపురం జమీందారు ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు(చంటిదొర), రాజరాజేశ్వరేనని ఆమె వినమ్రపూర్వకంగా చెబుతారు. సర్వారాయ హరికథా పాఠశాలలో ఆమె విద్య నేర్చుకోవడమే కాకుండా మూడు సంవత్సరాలు గౌరవ ప్రధానార్చకురాలిగా కూడా పనిచేశారు. కపిలేశ్వరపురం, పామర్రు పరిసర ప్రాంతాల్లో కళాకారులంతా ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్నారు. తమకే అవార్డు వచ్చినంత సంతోషంగా ఉందని కళాకారులు మరివాడ బుజ్జయ్య, వాడ్రేవు ప్రసాద్‌, నాగిరెడ్డి సతీష్‌, గొర్రెల కృష్ణ, వి.వీరభద్రరావు తదితరులు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని