logo

సి-విజిల్‌ ఫిర్యాదులపై సత్వర చర్యలు

సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్‌ యాప్‌కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు.

Published : 28 Mar 2024 03:15 IST

హాజరైన కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌: సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్‌ యాప్‌కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌మీనా అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ తన విడిది కార్యాలయం నుంచి హాజరయ్యారు. సి-విజిల్‌ యాప్‌ ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మోడల్‌ కోడ్‌ అమలు బృందాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. అంతర రాష్ట్ర, అంతర జిల్లాల సరిహద్దుల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరాయంగా ఇక్కడ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇంటి వద్దే ఓటుకు ఏర్పాట్లు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. పోలింగ్‌ రోజున ప్రత్యేక వాహనంలో వీరి వద్ద వెళ్లి బ్యాలెట్‌ పేపరులో ఓటేసే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఓటేసిన తర్వాత సీల్‌ వేసిన బ్యాలెట్‌ పత్రాలను తహసీల్దారు కార్యాలయం ద్వారా రిటర్నింగ్‌ కార్యాలయానికి తరలిస్తారని, ఈ ప్రక్రియ అంతా వీడియో తీస్తారని తెలిపారు. దీని కోసం నూతనంగా మొబైల్‌ ఓటింగ్‌ వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధాప్యం, 40 శాతం వైకల్యంతో పోలింగ్‌ రోజు వరసలో నిలబడి ఓటేసే ఇబ్బంది లేకుండా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా వీరిని బూత్‌స్థాయి అధికారులు గుర్తిస్తారని తెలిపారు. ఈ ఓటర్లు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి ఫారం-12డి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని