logo
Published : 07/12/2021 05:32 IST

ట్రస్టు సేవలు ప్రశంసనీయం


దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేస్తున్న హరనాథబాబు, ట్రస్టు ప్రతినిధులు

నిజాంపట్నం, న్యూస్‌టుడే : నిజాంపట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు తుపాను ఛారిటబుల్‌ ట్రస్టుగా ఏర్పడి పేదలకు సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని వైకాపా నేత మోపిదేవి హరనాథబాబు పేర్కొన్నారు. దివ్యాంగులైన విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు ఛైర్మన్‌ గొరికపూడి రాజగోపాలరావు మాట్లాడుతూ.. తాము, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కలిసి చదువుకున్నామని, ట్రస్టు ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో ఎంపీ తనవంతు చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు. తమ సేవలను తీరప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీనరసమ్మ, ట్రెజరర్‌ దబ్బకూటి బసవరాజు, ట్రస్టీలు తాడికొండ నరసింహారావు, బాలబ్రాహ్మేంద్రరెడ్డి, సభ్యులు గోవిందరెడ్డి, గుల్జార్, రామానుజమ్మ, నాళం సాయిబాబు, వెంకటరమణ పాల్గొన్నారు. 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని