logo

1239 మందికి ఉపకరణాల పంపిణీ

గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 1239 మంది విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్లు, సీనియర్‌ సిటిజన్లకు రూ.1.79 కోట్ల విలువైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

Published : 20 May 2022 04:15 IST

చిన్నారికి ఉపకరణం అందజేస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి, ఎమ్మెల్యేలు రోశయ్య, శ్రీదేవి తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 1239 మంది విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్లు, సీనియర్‌ సిటిజన్లకు రూ.1.79 కోట్ల విలువైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌ సమీపంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఆద్వర్యంలో ఉపకరణాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ 2019 అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో దివ్యాంగుల అవసరాలను గుర్తించడం కోసం శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో గుర్తించిన వారికి మూడు చక్రాల సైకిళ్లు, వీల్‌చైర్స్‌, చంకకర్రలు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కళ్ల జోళ్లు తదితర వాటిని పంపిణీ చేశామన్నారు. ఇంకా ఎవరికైనా ఉపకరణాలు అవసరం ఉంటే ఒకసారి శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి, జేసీ జి.రాజకుమారి, వికలాంగుల సంస్థ ఛైర్మన్‌ ముంతాజ్‌పఠాన్‌, సహాయ సంచాలకులు వెంకటప్పయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని