logo

ఆ కాలనీల్లో ఉంటేనే...

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తుకు ఉద్దేశించిన పథకం ‘జగ్జీవన్‌ జ్యోతి’. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగం వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా 2019 జులై 24న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం నిబంధనల్లో

Published : 30 Jun 2022 05:17 IST

జగ్జీవన్‌ జ్యోతి పథకం నిబంధనల్లో మార్పు
71,137 మంది ఎస్సీ, ఎస్టీలు ఉచిత విద్యుత్తుకు దూరం
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

స్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తుకు ఉద్దేశించిన పథకం ‘జగ్జీవన్‌ జ్యోతి’. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగం వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా 2019 జులై 24న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. వాటి అమలు గత నెల నుంచి మొదలైంది. ఫలితంగా పలువురు ఎస్సీ, ఎస్టీలు తిరిగి బిల్లు పరిధిలోకి రానున్నారు. వారిపై యథావిధిగా విద్యుత్తు భారం పడతుంది.

షరతులు వర్తిస్తాయ్‌...
పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించారు.
ఒకే వ్యక్తి పేరిట ఒకటికి మించి మీటర్లు ఉంటే పథకం లబ్ధిని ఒక దానికే పరిమితం చేశారు.
మూడో నిబంధన అత్యధికులను అనర్హులను చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో నివాసం ఉన్న వారు మాత్రమే పథకానికి అర్హులు. ఇతర కాలనీల్లో ఎస్సీ, ఎస్టీలు నివాసం ఉన్నా వారికి అర్హత లేదు. ఇది లబ్ధిదారుల్లో కోత వేస్తోంది. తాజా మార్పులతో గత నెలలో విద్యుత్తు బిల్లులకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య నుంచి అనర్హులను గుర్తించి, వారికి బిల్లులు చెల్లించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

పట్టణాల్లో ఎక్కువ...
మొత్తం మీద తాజా మార్పులతో 71 వేలకు పై చిలుకు కుటుంబాల లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధిని పొందే అర్హతను కోల్పోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలనీల గుర్తింపునకు పెద్దగా ఇబ్బంది లేక పోయినా గుంటూరు నగరం, ఇతర పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల గుర్తింపు అధికారులకు సైతం కష్టంగా మారింది. ఎందుకంటె రెవెన్యూ విభాగం నోటిఫై చేసిన కాలనీలు కొన్ని మాత్రమే ఉండగా అధిక సంఖ్యలోని లబ్ధిదారులు ఇతర కాలనీల్లో కూడా ఉన్నారు. కాగా ఇంకా లోతైన విశ్లేషణ కొనసాగుతుంది.


జాబితాల పరిశీలన కొనసాగుతోంది
- బి.అశోక్‌కుమార్‌, విద్యుత్తు విభాగ డీఈ, తెనాలి

జగ్జీవన్‌ జ్యోతి పథకానికి సంబంధించి మారిన నిబంధనల మేరకు గతంలో ఉన్న లబ్ధిదారుల జాబితాల సమగ్ర విశ్లేషణ, పరిశీలన కొనసాగుతోంది. చాలా వరకు పథకం పరిధిలోకి రాని వారిని గుర్తించాం. అర్హత ఉండి పథకం నుంచి తీసివేస్తే సంబంధితులు సంప్రదించవచ్చు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని