logo

వేదమాతా..వందనం

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తుల రద్దీ తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ఒకేలా కొనసాగింది.

Updated : 29 Sep 2022 06:33 IST

అర్జునవీధిలో నగరోత్సవం

ఈనాడు, అమరావతి: విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తుల రద్దీ తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ఒకేలా కొనసాగింది. 60వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది. కనీసం లక్ష మందికి పైగా రానున్నారు. ఆదివారం మూలానక్షత్రం రోజున ఒకే రోజు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.

దసరా ఉత్సవాల రెండో రోజు ఆదాయం మరింత పెరిగింది. మొదటి రోజు వివిధ సేవలు, టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలపై రూ.26 లక్షలు రాగా... రెండో రోజు రూ.37లక్షలు వచ్చాయి. రూ.500 టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.8లక్షలు, రూ.300 టిక్కెట్లపై రూ.10లక్షలు, రూ.100 టిక్కెట్లపై రూ.5లక్షలు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.9లక్షలు, వివిధ పూజలు, సేవలపై రూ.4.5లక్షల ఆదాయం వచ్చింది. ఉత్సవాలకు తరలివచ్చే వృద్ధులు, దివ్యాంగులను స్వచ్ఛంద సేవకులు వీల్‌ఛైర్లలో ఉంచి కొండపైకి తీసుకెళ్తున్నారు. వీరికి ఉదయం 10 నుంచి మధ్యా.12, సా.4 నుంచి 6గంటల వరకూ సమయాలను కేటాయించారు.

నేడు అన్నపూర్ణాదేవిగా...

దసరా ఉత్సవాల నాలుగో రోజు గురువారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి.

గాయత్రీ రూపంలో దుర్గమ్మ

క్యూలైన్లలో రద్దీ

గాయత్రీ శరణు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని