logo

రాజధానిలో రహదారి విధ్వంసంపై ఫిర్యాదు

మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలో రాజధానిలో ఇ-9 రహదారి 1+450 కిలోమీటరు వద్ద 250మీటర్ల మేర ధ్వంసం చేసి గుర్తుతెలియని వ్యక్తులు రూ.50లక్షలు నష్టపరిచారని మెగా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ విజయవాడ రీజనల్‌ మేనేజర్‌ మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 05 Oct 2022 03:53 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలో రాజధానిలో ఇ-9 రహదారి 1+450 కిలోమీటరు వద్ద 250మీటర్ల మేర ధ్వంసం చేసి గుర్తుతెలియని వ్యక్తులు రూ.50లక్షలు నష్టపరిచారని మెగా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ విజయవాడ రీజనల్‌ మేనేజర్‌ మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. కాగా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్‌తో మట్టి తరలించుకుపోయినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జరిగిన తవ్వకాలపై వీఆర్వో నుంచి కూడా ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని