logo

చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు పర్యటన

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 8 నుంచి 10 వరకు చేపడుతున్న పర్యటన చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయటానికి నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా కృషి చేయాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు అన్నారు.

Published : 07 Dec 2022 04:21 IST

చీరాల గడియార స్తంభం వద్ద పరిశీలిస్తున్న నాయకులు

బాపట్ల, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 8 నుంచి 10 వరకు చేపడుతున్న పర్యటన చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయటానికి నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా కృషి చేయాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు అన్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై చర్చించటానికి బాపట్లలోని తెదేపా జిల్లా కార్యాలయానికి ఆయన మంగళవారం రాత్రి వచ్చారు. నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ, సీనియర్‌ నేతలతో సమావేశమై బాబు పర్యటన ఏర్పాట్లపై సూచనలు చేశారు. పట్టణంలో రోడ్‌షో జరిగే మార్గం, బహిరంగసభ నిర్వహిస్తున్న అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల కూడలి ప్రాంతాన్ని ఏలూరి పరిశీలించారు. సాంబశివరావు మాట్లాడుతూ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న పొన్నూరు, 9న బాపట్ల, 10న చీరాలలో బాబు పర్యటిస్తారని తెలిపారు. వేగేశన మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. చీరాలలో అధినేత చంద్రబాబు పర్యటన మార్గాన్ని ఇన్‌ఛార్జి ఎం.ఎం. కొండయ్యతో కలిసి పరిశీలించారు. తెదేపా నేతలు జేపీ గౌడ్‌, సలగల రాజశేఖరబాబు, రావిపూడి నాగమల్లేశ్వరరావు, పంగులూరి శ్రీనివాసరావు, తానికొండ దయాబాబు పాల్గొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నెల 8, 9, 10న పర్యటన వివరాలను పార్టీ నేతలు ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

8న మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 1.45 గంటల నుంచి పెదకాకాని నుంచి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన

2.30 గంటలకు నారాకోడూరు నుంచి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన, రైతులతో సమావేశం

3.45 గంటలకు వీధి సమావేశం

4.30 గంటలకు నారాకోడూరు నుంచి పొన్నూరు వరకు రోడ్‌షో

సాయంత్రం ఆరు గంటలకు పొన్నూరు ఎన్జీరంగా విగ్రహం సెంటర్‌లో బహిరంగసభ

రాత్రి 8.30 గంటలకు పరంధయ్య కన్వెన్షెన్‌ సెంటర్‌లో రాత్రికి బస

9న ఉదయం 11 గంటలకు పరంధయ్య కన్వెన్షెన్‌ సెంటర్‌లో ముస్లిం మైనార్టీలతో సమావేశం

మధ్యాహ్నం 2.30 గంటలకు పొన్నూరు నుంచి పయనం

మధ్యాహ్నం 3.15 గంటలకు బాపట్ల మండలం చుండూరుపల్లి చేరిక

సాయంత్రం 4.30 గంటలకు ఈతేరు, అప్పికట్ల మీదగా బాపట్ల పట్టణంలోకి ప్రవేశం

సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల పట్టణం చీలురోడ్డు నుంచి రోడ్‌షో

సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు బాపట్ల పట్టణం అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల కూడలిలో బహిరంగసభ

రాత్రి ఎనిమిది గంటలకు బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల అతిథిగృహంలో బస

10న బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల అతిథిగృహంలో 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు, బీసీ నేతలతో సమావేశం

మధ్యాహ్నం 2.20 గంటలకు బాపట్ల మండలం స్టూవర్టుపురం చేరుకుని మహిళలతో సమావేశం

సాయంత్రం 4.20 గంటలకు ద్విచక్రవాహనాల ప్రదర్శనతో పేరాల సెంటర్‌కు రాక, అక్కడి నుంచి చీరాల గడియార స్థంభం సెంటర్‌కు రోడ్‌షో

సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు చీరాల గడియారస్తంభం సెంటర్‌లో బహిరంగసభ

రాత్రి ఏడు గంటలకు చీరాల నుంచి బయలుదేరి చిలకలూరిపేట మీదుగా గన్నవరం విమానాశ్రయానికి రాత్రి 10.30 గంటలకు చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని