logo

మత్తు, మాదకద్రవ్యాల విక్రేతలపై పీడీ చట్టం నమోదు

మత్తు, మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులపై పీడీ చట్టం నమోదుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గుంటూరు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 05:28 IST

గుంటూరు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ త్రివిక్రమవర్మ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : మత్తు, మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులపై పీడీ చట్టం నమోదుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గుంటూరు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐజీ గుంటూరులోని తన కార్యాలయం నుంచి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ గంజాయి, మత్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న వారిని గుర్తించి పీడీ చట్టం నమోదుకు ప్రతిపాదనలు పెట్టాలన్నారు. నాటుసారా తయారు చేస్తున్న కేసుల్లో నేరాలకు పాల్పడుతున్నవారిపైనా పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్‌, ప్రకాశం ఎస్పీ మల్లికగార్గు, మూడు జిల్లాల డీఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని