logo

పక్కదారి పట్టిన రేషన్‌ బియ్యం

రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 29 Mar 2024 03:47 IST

నరసరావుపేట సెంట్రల్‌, న్యూస్‌టుడే : రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన రేషన్‌ డీలర్‌ పేదలకు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా అర్ధరాత్రి అక్రమంగా రిక్షాలో బయటకు తరలించేశారు. కొంతమందితో వేలిముద్రలు వేయించుకొని బియ్యం ఇవ్వకుండా అధిక ధరకు అమ్ముకునేందుకు తరలించడం వార్డులో చర్చనీయాంశమైంది. నెలాఖరు కావటంతో ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో బియ్యాన్ని తరలించారని ఆ వార్డు ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. దుకాణంపై ఫలానా నంబరు అని కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులంతా ఎన్నికల పనుల్లో ఉండగా ఇలా తరలించేస్తున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరా శాఖ అధికారులు పేదలకు బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని