logo

గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం

గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 29 Mar 2024 04:00 IST

మేదరమెట్ల, న్యూస్‌టుడే: గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన అనిల్‌ అనే మత్స్యకారుడు గుండ్లకమ్మ జలాశయంలో బుధవారం రాత్రి వల వేశారు. గురువారం వల బయటకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా ఉంది. బయటకు తీసి చూడగా అందులో మొసలి చిక్కుకొని ఉంది. అప్పటికే అది మృతిచెంది ఉంది. సమాచారం అందుకున్న అటవీ, మత్స్యశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. అటవీ శాఖ అధికారి శశిభూషణ్‌ మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి, కొరిశపాడు మండలాల్లో గుండ్లకమ్మ జలాశయం బ్యాక్‌వాటర్‌ ఎక్కువ గ్రామాల్లో ఉంటుందని, సంబంధిత గ్రామాల్లోని రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని