logo

భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్‌ కమిషనర్‌ మధుబాబు తెలిపారు.

Published : 29 Mar 2024 04:34 IST

పట్నంబజారు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్‌ కమిషనర్‌ మధుబాబు తెలిపారు. జిన్నా టవర్‌ సెంటర్‌లోని కార్యాలయంలో గురువారం వ్యాపార వర్గాల ప్రతినిధులు, ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిల్లులు లేకుండా రవాణా చేసే సరకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కుంకుమ భరిణెలు, గృహోపకరణాలు, స్కూల్‌ బ్యాగ్‌లు, ట్రావెలింగ్‌ బ్యాగ్‌లు, సీలింగ్‌ ఫ్యాన్లు, చరవాణులు, గోడ గడియారాలు, బైక్‌లు, మిక్సీలు, గ్రైండర్లు తదితరాలను పెద్ద మొత్తాల్లో దిగుమతి చేసుకునే వారిపై నిఘా ఉంటుందని  చెప్పారు. వ్యాపార వర్గాలు గతంలో కంటే ఎన్నికల వేళ ఎక్కువ సరకులను దిగుమతి చేసుకుంటే వాటి వివరాలు, బిల్లులు, వే బిల్లులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఇప్పటికే వ్యాపార వర్గాలకు సంబంధించిన గోదాములపై అధికారుల పర్యవేక్షణ ఉందన్నారు. ఇతరుల పేర్లతో భారీగా సరకులను తెప్పించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ మురళీకృష్ణ, ఆడిటర్లు దామచర్ల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ శివ, తిరుమళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని