logo

కలిసి జీవిద్దామనుకున్నారు.. కలిసే మరణించారు

కులాలు వేరు కావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మైలార్‌దేవుపల్లి సీఐ నరసింహ కథనం ప్రకారం...మైలార్‌దేవుపల్లిలో ఉండే జయమ్మ కుమారుడు రవికుమార్‌(20)

Published : 12 Aug 2022 03:56 IST
రవికుమార్‌

కాటేదాన్‌, న్యూస్‌టుడే: కులాలు వేరు కావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మైలార్‌దేవుపల్లి సీఐ నరసింహ కథనం ప్రకారం...మైలార్‌దేవుపల్లిలో ఉండే జయమ్మ కుమారుడు రవికుమార్‌(20) పదో తరగతి చదువుకుని ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లిని పోషిస్తున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన బాలిక(17)ను ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇళ్లలోని వారికి తెలియడంతో మండిపడ్డారు. ఇద్దరిని కలవనివ్వలేదు. వారం క్రితం కొడుకును తీసుకుని తల్లి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌కు వెళ్లింది. రెండురోజుల క్రితం తిరిగి వచ్చింది. బుధవారం బంధువుల ఇంట పెళ్లికి శంషాబాద్‌ వెళ్లింది. రవికుమార్‌ ఒక్కడే ఉండగా బుధవారం అర్ధరాత్రి బాలిక ప్రియుడి ఇంటికెళ్లింది. ముందు వైపు తాళం వేసి, వెనకనుంచి ఇంట్లోకెళ్లిన ఇద్దరు లోపల నుంచి గడిపెట్టుకున్నారు. పెద్దలు పెళ్లిచేసుకోనివ్వరు... ఆత్మహత్యే శరణ్యమనుకున్నారేమో... వంటింట్లో దూలానికి ఒకే తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం ఇంట్లో ఉరికి వేలాడుతున్న ఇద్దరిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని