logo

ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు.

Updated : 25 Apr 2024 06:04 IST

రాష్ట్రంలో జిల్లాకు 27వ స్థానం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు.

  • 2022- 2023లో జిల్లా ద్వితీయ సంవత్సరంలో  25 స్థానం, ప్రథమ సంవత్సరంలో 30 స్థానంలో ఉండగా.. ఈసారి మాత్రం (2023-2024) ద్వితీయలో 27 స్థానం, ప్రథమంలో 22 స్థానంలో నిలిచింది. ః జిల్లాలో ప్రథమ సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 6455 మంది పరీక్ష రాయగా 3428 మంది ఉత్తీర్ణతను (53.11 శాతం) సాధించారు. వీరిలో బాలికలకు 3443 మంది పరీక్ష రాయగా 2126 మంది (61.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3012 మంది పరీక్షను రాశారు. 1302 మంది ( 43.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
  • ద్వితీయ సంవత్సరం మొత్తం 6456 మంది పరీక్ష రాయగా 3965 మంది ఉత్తీర్ణత (61.42) సాధించారు. బాలికలు 3446 మందికి 2352 మంది (68.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3010కి 1613 (53.59 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
  • వృత్తి విదా కోర్సుల్లో (ఒకేషనల్‌) ప్రథమ సంవత్సర 1353 మందికి 715 మంది ఉత్తీర్ణత (52.85 శాతం) సాధించారు. ద్వితీయలో 1242 మందికి 839 మంది (67.55శాతం) ఉత్తీర్ణులయ్యారు.  

గతం కంటే  7 శాతం ఎక్కువ

గతేడాది ప్రథమంలో 46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించగా ఈసారి 53.11 శాతం ఉత్తీర్ణత అందుకున్నారు. దీంతో ఈసారి 7 శాతం పెరిగింది. ద్వితీయలో గత సంవత్సరం 60 శాతం ఉత్తీర్ణులైతే ఈసారి 61.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1.42 శాతం పెరిగింది.

మోమిన్‌పేట: మోమిన్‌పేట, చంద్రాయన్‌పల్లిలోని కేజీబీవీ విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 88శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రత్యేక అధికారిణి ప్రభావతి తెలిపారు.  

రెండో స్థానంలో పరిగి కళాశాల

పరిగి, న్యూస్‌టుడే: పరిగిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. గతేడాదితో పోల్చితే ద్వితీయలో ఐదు శాతం మేరకు ఫలితాలు పెరిగాయి. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అధ్యాపకుల చొరవతో ఈసారి  69.32 శాతంతో జిల్లాలోనే ద్వితీయ స్థానం లభించిందని ప్రిన్సిపల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మహమ్మదాబాద్‌ మండలం మంగంపేట్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌  బైపీసీ విభాగంలో 922 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ః ఎంపీసీ విభాగంలో ఎ.స్వాతి వెయ్యి మార్కులకు 903 మార్కులు పొంది కళాశాల టాపర్‌గా నిలిచింది.  

గిరిజన బాలికల ప్రతిభ

పరిగి సమీపంలోని గిరిజన గురుకుల బాలికల విద్యాలయం విద్యార్థులు ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలను సాధించారు. కళాశాల మొత్తంగా 1444 మంది విద్యార్థులకు 94.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వై.సుమతి తెలిపారు.

మెరుగైన ప్రగతి సాధించాం

శంకర్‌నాయక్‌, నోడల్‌ అధికారి, ఇంటర్మీడియట్‌

అధ్యాపకుల అందరి కృషితో ఇంటర్మీడియట్‌లో గత సంవత్సరం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాం. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్‌ ప్రాక్టిస్‌ లేకుండా పర్యవేక్షించాం. ముమ్మర తనిఖీలు చేశాం.  ఫలితాలు సంతృప్తినిచ్చాయి.

కొడంగల్‌లో 50 శాతమే..

కొడంగల్‌, న్యూస్‌టుడే: జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా పేరున్న కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫలితాల్లో 50 శాతం దాటలేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 199 మందికిగాను 132 ఉతీర్ణత సాధించగా, ద్వితీయ 170 మందికి 84 మంది మాత్రమే ఉతీర్ణులయ్యారు.

కస్తూర్బా కళాశాలలో ద్వితీయలో 75 శాతం, ప్రథమ 87శాతం ఉతీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ స్రవంతి తెలిపారు.

పూడూరు: పూడూరు ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ ద్వితీయలో మణికాంత్‌ 961, నిఖిత 947, మార్కులు సాధించారు.  

సంగం లక్ష్మీబాయి కళాశాల మెరుగైన ఫలితాలు

వికారాబాద్‌ కలెక్టరేట్‌: స్థానిక సంఘం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విదార్థినులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 98.7 శాతం ఫలితాలను సాధించారు.  ద్వితీయ సంవత్సరంలో  79 మందికి 78 మంది ఉత్తీర్ణులయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణమ్మ తెలిపారు. ః జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయలో ఆస్మా సుల్తానా  989 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిందని ప్రిన్సిపల్‌ స్వాతి తెలిపారు. డి.సానియా 984 మార్కులు సాధించింది. ఎంపీసీ ద్వితీయలో ఎస్‌కె. అంజుమ్‌ 975 మార్కులు సాధించింది. 

బీసీ వసతి గృహ విద్యార్థులు 73శాతం ఉత్తీర్ణత

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో 73 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఇంటర్‌లో 266 మంది పరీక్ష రాయగా 146 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా సంక్షేమ అధికారి ఉపేందర్‌ బుధవారం తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 300 మంది రాయగా 220 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.

గురుకుల విద్యార్థినుల ప్రతిభ

తాండూరుగ్రామీణ: ఇంటర్‌ ఫలితాల్లో తాండూరు మండలం ఖాంజాపూర్‌ గేటు వద్ద ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు సత్తా చాటారు. అత్యధిక మార్కులతో మండల టాపర్‌లుగా నిలిచారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో మహేశ్వరీ, ఎమ్‌.వైష్ణవి 979, విష్ణుప్రియ 978, ఎంపీసీలో ఆర్‌.సరిత 980, బి.అనూష 970, కె.మాధవి 968 మార్కులతో ముందంజలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో 95శాతం, ప్రథమ సంవత్సరంలో 90 శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్‌ శ్రీదేవి బుధవారం తెలిపారు.  

కస్తూర్బాలో 80.76 శాతం ఉత్తీర్ణత: తాండూరు మండలం ఐనెల్లి శివారునున్న కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలు 80.76 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రత్యేకాధికారిణి విజయరత్న వెల్లడించారు.  ః అలాగే ఆదర్శ కళాశాల విద్యార్థినిలు  74శాతంతో రాణించారని ప్రిన్సిపల్‌ ప్రకాశ్‌ తెలిపారు.  

429 మార్కులు సాధించిన సానియా.. తాండూరు: తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమం బైపీసీలో విద్యార్థిని సానియా 440 మార్కులకు 429 మార్కులు సాధించింది. కళాశాల టాపర్‌గా నిలిచిందని ప్రిన్సిపల్‌ ఎ.రాజమోహన్‌ రావు తెలిపారు.

పెద్దేముల్‌: ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో పెద్దేముల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 60 శాతం ఫలితాలను సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని